Skip to main content

ప్రేమ పెళ్లి

            హాయ్ నా పేరు ఆకాష్. ఇన్నాళ్ల  నా కల ఈరోజు నిజమవుతుంది. హ అవును నా పెళ్లి .  5యేళ్ల నా ప్రేమ ఈరోజు పెళ్లిగా మారుతుంది. తన పేరు భూమి. నా మరదలు. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. ఒకరంటే ఒకరికి ప్రాణం. నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి తనుఒక్కటే. ఇద్దరి ప్రవర్తనలు వేరు వేరు. కానీ ఇద్దరి ఆలోచనలు ఒకటే. నేను ఈరోజు హ్యాపీ ఉంటె చాలు అనుకునే వాణ్ణి. తనేమో రేపటి గురించి ఆలోచన ఉండాలి అంటుంది. 

              అయినా మా ప్రేమ చాల విచిత్రంగా, నిజంగా సినిమా లో చూపించినట్టే కలిగింది. చిన్నప్పుడు గొడవలు, పెద్దయ్యాక ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ పుట్టాయి. మొదట్లో తనకు మా పెళ్లి జరగదేమో అనేది. ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి వద్దు అనేది. నేను కూడా అంతే కదా అనుకునేవాణ్ణి. కానీ కొన్నాళ్ళకు మా ప్రేమ మీద మాకు నమ్మకం పెరిగింది. ఇంట్లో తెలిసాక అందరు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు మా పెళ్లి ఇంత సంతోషంగా జరుగుతుంది. ఇక ఒక గంటలో తనని పెళ్ళికూతురిలా చూడబోతున్న. నేను ఫుల్ గ రెడీ అయ్యి కళ్యాణమండపానికి బయల్దేరుతున్నాను . 

              ఇంతలో పెళ్ళికూతురి వాహనం ఆక్సిడెంట్ అయ్యిందని ఫోన్ వచ్చింది. మేము హాస్పిటలికి  వెళ్లేసరికి  తను చనిపోయింది. తనని అలా చూసేసరికి నాకు ఏం చెయ్యాలో తోచలేదు. ఒక గంట ముందు కూడా తనతో మాట్లాడాను. అంతలోనే ఇలా మూగబోయేసరికి నాకు మాటలు రావట్లేదు. మేము ఇద్దరం కలిసి కన్నా కలలు, మా భవిష్యత్తు గురించి చేసుకున్న ఆలోచనలు అన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. 

             నాకు తను లేదు అనే ఆలోచనే రావట్లేదు. ఇంకా తను ఉంది వస్తుంది అనే ధ్యాస లోనే బ్రతికున్న. అందరికి దూరంగా తన జ్ఞాపకాలతో అలా రెండేళ్లు గడిచాయి. ఇక ఇంట్లో మెల్లిగా పెళ్లి చేసుకోవాలి అనే మాటలు పెరిగిపోయాయి. ఇక ఇంట్లో ఉండలేక ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నాను. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుండగా కనిపించింది. తనని చూస్తే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటె తనకు ఉన్న ధైర్యం కూడా నాకు లేదని.  ఇంతలో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నన్ను చూస్తే నవ్వొస్తుందా అని గట్టిగ తిడుతుంది. అప్పుడే తనకి చెప్పా నాక్కుడా చనిపోవాలని ఉంది కానీ మనకంటూ ఒక కుటుంబం, వాళ్ళ భాద్యత మనవే కదా అని అలాగే బతికున్నాను అని చెప్పాను. తను ఏడుస్తూ నేను కూడా కుటుంబం కోసమే చనిపోతున్నా.నేను ఉంది వాళ్ళ పరువు తీయకూడదు అనే చనిపోతున్నా అని చెప్తుంది.ఏమైంది అని అడిగితె తన పేరు మేఘన. తాను ఒకడిని లవ్ చేసింది. పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకున్నాం. తను ఒక ప్రమాదంలో చనిపోయాడు. అంతే గాక తన వాళ్ళ మేఘన ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే వాళ్ళ పరువు పోవడమే కాదు, అమ్మ,నాన్నలు కూడా ఏమైనా చేసుకుంటారు అని భయంతో చనిపోతున్నా అని చెప్తుంది. అప్పుడు దీనికి వేరే పరిష్కారం ఆలోచిద్దాం అని అన్నాను.నువ్వెందుకు చనిపోవాలి అని నన్ను అడిగింది అప్పుడు నేను భూమి గురించి చెప్పాను. అయితే మనమిద్దరం బ్రతికున్న శవాలమే కదా అంది. నాకు కూడా నిజమే కదా మన అనుకున్న మనిషి లేకపోతె మన బ్రతుకే వ్యర్థము కదా. అంతలోనే తను ఒక ఆలోచన చెప్పింది. మనమిద్దరికి బ్రతుకు మీద ఆశ లేదు. అందుకు మనం ఒక పని చేద్దాం.  అది ఏంటంటే నాకు పుట్టబోయే బిడ్డ మనదే అని చెప్దాము, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం,  అంది. నాకు వెంటనే కోపం వచ్చింది. అంతలోనే తను నీకు ఎలాగో జీవితం మీరు ఆశ లేదు. కనీసం ఈ పుట్టబోయా బిడ్డ కోసమైనా చేయొచ్చు కదా. నీకేం ఇబ్బంది ఉండదు. బిడ్డ పుట్టాక నీ దారి  నీది నా దారి నాది. అప్పటికి నా ఫామిలీ కూడా మనది ప్రేమపెళ్లి  కలిసి  రాలేదు  అనుకుంటారు. బిడ్డ కోసం అనేసరికి నేను ఆలోచనలో పడ్డాను. కానీ మీ ఇంట్లో వాళ్ళు తరువాత ఏదయినా ఇబ్బంది పెడితే అని అడిగాను. కానీ తనేమో మా ఇంట్లో వాళ్ళు చాల మంచోళ్ళు. మొదట్లో ఏదయినా తిట్టొచ్చు తరువాత ఒప్పుకుంటారు అంది. నాకూ ఇంట్లో పెళ్లి అంటున్నారు కదా ఇలా కొన్నాళ్ళు ఉంది, బిడ్డ పుట్టాక ఇక్కడినుంచి వెళ్లిపోవచ్చు అనుకున్న. 

             అనుకున్నట్టు గానే మేఘన ఇంటికి వెళ్ళాము. మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం అని చెప్పింది.అందరు అరిచారు. ఎవరు ఒప్పుకోలేదు. ఇంతలో మేఘన వాళ్ళ బంధువుల్లో ఒకరు నన్ను చూస్తూ నువ్వు విశ్వనాధ్ కొడుకువి కదా అన్నారు. అవును అన్నాను. అంతే అందరు ఒక్కసారిగా విచిత్రంగా చూస్తున్నారు. ఏమైందో తెలియదు. ఒక రోజు అక్కడే ఉండమన్నారు. నాకు అర్థం కాలేదు మేఘన తో మాట్లాడదామంటే కుదరట్లేదు. అలా తికమకగానే రాత్రి అంత గడిచింది. ఉదయం కాగానే నాన్న వాళ్ళు వచ్చారు. ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాను. అవేమి పట్టించుకోకుండా నన్ను రెడీ అయ్యి రా అని చెప్పి గుడికి పిలిచుకెళ్ళారు. అప్పటికి అక్కడ మేఘన, వాళ్ళ అమ్మనాన్నలు అందరు ఉన్నారు. ఇద్దరి జాతకాలు చూసి పెళ్లి ముహర్తం పెట్టంచారు. రేపే పెళ్లి. నాకేం అర్థం కాలేదు. నాన్న అడిగితే ఏం పర్లేదు అంటున్నాడు. ఇలా కాదని మేఘనని గట్టిగా అడిగేసరికి వాళ్ళు మాకు బంధువులే అని తెలిసి అందరు ఒప్పుకున్నారు, మీ నాన్న మా మావయ్య కి తెలుసు అందుకే పిలిపించి ఇలా జరిగింది అంటే మీ నాన్న కూడా పిల్లలు ప్రేమించుకుంటే మనమేం చేస్తాం అని ఒప్పుకున్నారు. అని చెప్పింది. వెంటనే నా గుండె జారిపోయింది, ఎదో కొన్నాళ్ళు ఉంది తన సమస్య తీరక వెళ్లిపోవచ్చని అనుకుంటే ఇలా జరిగిందేంటి. ఇప్పుడేం చేద్దాం అని మేఘనని అడిగా, ఇలా అయితే నేను వెళ్లిపోతా అని చెప్పాను. తను అలా చేయొద్దు సమస్య ఇంకా పెద్దగా అవుతుంది అని సర్ది చెప్పి , ఇప్పటికైతే పెళ్లి కానీ తరువాత ఆలోచిద్దాం అంది. నేను చేసేదేమి లేక అలానే ఉంది పోయా. పెళ్లి అయ్యింది.

             పెళ్లి తరువాత మా ఇంటికి వచ్చాము. ఏదైతే ఏమిందిలే ఒక బిడ్డని కాపాడాము అనే భావన లో నేను ఉన్నాను. అలా అయిదు నెలలు గడిచాయి, అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. మేఘనకి నన్ను కలిసినప్పుడు నెలన్నర్ర, ఇప్పుడు ఒక అయిదు నెలలు ఇంతవరకు ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళలేదు. తను కూడా మామూలుగానే అన్ని పనులు చేస్తుంది అని. మేఘనని అప్పుడప్పుడు బిడ్డ  ఎలా ఉంది, ఆరోగ్యం బాగానే ఎలా ఉంది అడిగే వాణ్ణి . ఎప్పుడు ఏ సమస్య లేదనేది. ఒకరోజు ఉండబట్టలేక తనకి బయటికి అని చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. అక్కడ నాకు మళ్లీ గుండె జారినంత పని అయ్యింది. అసలు తను ప్రెగ్నెంట్ కాదు. ఇన్నాళ్లు తను నన్ను మోసం చేసింది.నాకు కోపం వచ్చింది తన చెంప పగలగొట్టి అడిగాను ఎందుకిలా చేసావు అని  నాకు నిజం తెలిసాక తన నాతొ మాట్లాడలేకపోయింది. ఇంటికొచ్చాక అడిగిన సమాధానం ఇవ్వట్లేదు. ఒక వారం తర్వాత  నాకు విసుగొచ్చేసి తనకు విడాకులు ఇస్తానని చెప్పాను. తను బయపడి అప్పుడు చెప్పింది, తనకి నేను ముందే తెలుసనీ, మా పెళ్లి కి వాళ్ళు కూడా వచ్చేవారని చెప్పింది. భూమి కి అలా జరిగాక నువ్విలా పిచ్చోడిలా అందరిని వదిలేసి తిరుగుతున్నావని తెలిసింది. ఒకసారి చెప్పి చూద్దాం అనుకున్నా, కానీ నువ్వు వినేలా లేవని వదిలేసా. కానీ నువ్వు నిజంగా అంతలా భూమి ప్రేమించావని తెలిసి నీమీద నాకు మంచి అభిప్రాయం కలిగింది, నాకు మీద ప్రేమ పుట్టింది. అప్పుడే ఇలా ప్రెగ్నెంట్ అని అబద్దం  చెప్పి నీకు దగ్గరయ్యాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను. 

             నువ్వు భూమి గురించి మర్చిపోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. తనలా నన్ను చూసుకోవాలని అనుకున్నాను. నీకు నిజంగా నా మీద ప్రేమ పుట్టేదాకా నేను వెయిట్ చేస్తాను. కానీ దయచేసి విడాకులు మాత్రం ఇవ్వకు. నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు కానీ నాతోనే ఉండు అంటే చాలు నాకు,  అని తను చెప్పేసరికి నేను ఏం అనాలో తెలియక బయటికి వచ్చేసాను. ఇప్పుడు నేనేం చేయాలి నేను ప్రేమించిన భూమి కోసం బ్రతకాలి లేక నన్ను ప్రేమించిన మేఘన కోసమా అని అర్థం కావట్లేదు. ఇలా ఉండగా మేఘన ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్న అని చెప్పింది. నేను బాగా ఆలోచించాను భూమి ప్రేమించిన నేను మేఘన కోసం బ్రతకాలి అని అనుకోని తన దగ్గరికెళ్లి ఒకటే అడిగా నాకోసం ఇంత చేసేంత ప్రేమ ఎందుకు నామీద అని. తను ఒకటే చెప్పింది ఐ లవ్ యు అని. ఇక నేను ఇన్నాళ్లు ఆపుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా వచ్చేసాయి. తను నన్ను చిన్నపిల్లాడిలా ఊదారుస్తుంటే నేను అలానే ఉండిపోయాను.

Comments

Popular posts from this blog

లవ్ ఇన్ 10th

             వంటరూమ్ లో నుంచి సుప్రభాతం మొదలెట్టాడు నాన్న. బారెడు పొద్దెక్కిన నేను ఇంకా లేవలేదు అని. అప్పుడప్పుడే నాకు మేలుకు వచ్చింది.లేచి చూసేసరికి ఆఫీస్ కి టైం అవుతుంది. వెంటనే త్వరగా రెడీ అయ్యి బైక్ ఎక్కి బయల్దేరాను. ఇంతలో రోడ్ మీరు ట్రాఫిక్ జాం అయ్యింది. మెయిన్ రోడ్ లో లేట్ అవ్వొచ్చని చిన్న సందులో నుంచి వెళ్తున్న. టైం లేదని స్పీడ్ గా వెళ్తున్న నాకు ఒక 45 ఏళ్ళ మధ్య వయసు ఆవిడ చంటిబిడ్డని చేతిలో పెట్టుకొని బండి కి అడ్డంగా వచ్చింది. సడెన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఇంతలో ఆవిడతో పాటు ఒక 21 ఏళ్ళ అమ్మాయి బురఖా లో తనని చూస్తూ వెళ్తుంది. బురఖాలోని ఆ అమ్మాయి ఎందుకో నన్ను అసహ్యంగా చూస్తుంది.ఆ కళ్ళలో నా మీద అంత కోపం ఎందుకో అర్థం కాలేదు. అసలు ఈ కళ్ళు ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నాయి. అసలు ఎవరు తను.               ఇదే ఆలోచనలతో ఆఫీస్ కి వచ్చాను. లంచ్ టైం అయ్యింది అయినా ఇంకా తానెవరో ఇంకా గుర్తుకురావట్లేదు. అప్పుడే సడెన్గా తను గుర్తుకొచ్చింది. తనే అయ్యింటుంది. అవి నేను పదవతరగతి చదివేరోజులు. మా క్లాస్ చిన్న గది బెంచీలు ఎక్కువ. అమ్...