Skip to main content

లవ్ ఇన్ 10th

             వంటరూమ్ లో నుంచి సుప్రభాతం మొదలెట్టాడు నాన్న. బారెడు పొద్దెక్కిన నేను ఇంకా లేవలేదు అని. అప్పుడప్పుడే నాకు మేలుకు వచ్చింది.లేచి చూసేసరికి ఆఫీస్ కి టైం అవుతుంది. వెంటనే త్వరగా రెడీ అయ్యి బైక్ ఎక్కి బయల్దేరాను. ఇంతలో రోడ్ మీరు ట్రాఫిక్ జాం అయ్యింది. మెయిన్ రోడ్ లో లేట్ అవ్వొచ్చని చిన్న సందులో నుంచి వెళ్తున్న. టైం లేదని స్పీడ్ గా వెళ్తున్న నాకు ఒక 45 ఏళ్ళ మధ్య వయసు ఆవిడ చంటిబిడ్డని చేతిలో పెట్టుకొని బండి కి అడ్డంగా వచ్చింది. సడెన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఇంతలో ఆవిడతో పాటు ఒక 21 ఏళ్ళ అమ్మాయి బురఖా లో తనని చూస్తూ వెళ్తుంది. బురఖాలోని ఆ అమ్మాయి ఎందుకో నన్ను అసహ్యంగా చూస్తుంది.ఆ కళ్ళలో నా మీద అంత కోపం ఎందుకో అర్థం కాలేదు. అసలు ఈ కళ్ళు ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నాయి. అసలు ఎవరు తను.

              ఇదే ఆలోచనలతో ఆఫీస్ కి వచ్చాను. లంచ్ టైం అయ్యింది అయినా ఇంకా తానెవరో ఇంకా గుర్తుకురావట్లేదు. అప్పుడే సడెన్గా తను గుర్తుకొచ్చింది. తనే అయ్యింటుంది. అవి నేను పదవతరగతి చదివేరోజులు. మా క్లాస్ చిన్న గది బెంచీలు ఎక్కువ. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రక్కపక్కనే. నా బెంచీ లో నేను,సురేష్ , రాజశేఖర్ కూర్చునేవాళ్ళం. నా ప్రక్కన బెంచీ లో మౌనిక,అయేషా,మేరీ ఉండేవాళ్ళు.  మౌనిక నా పక్కనే కాబట్టి, మంచి ఫ్రెండ్ అయ్యింది. మేము ఇద్దరం  చాల క్లోజ్ అయ్యాము. 

             మా క్లాస్ లో అప్పుడే గ్రూప్స్ డివైడ్ చేసారు. బాగా చదివే వాళ్ళు A గ్రూప్, యావరేజ్ గా చదివేవాళ్ళు B గ్రూప్, పాస్ మర్క్స్ వచ్చేవాళ్ళని C గ్రూప్, సరిగ్గా చదవలేని వాళ్ళని D గ్రూప్ గా చేసారు. నేను, మౌనిక  A గ్రూప్ కి  వచ్చాము. సురేష్ C గ్రూప్ లో ఉన్నాడు. అప్పుడప్పుడు A ,B  గ్రూప్ లు మాత్రమే కలిపి క్లాస్ చెప్పేవాళ్ళు. ఇలా ఉండగా ఒకరోజు మోనికా స్కూల్ కి రాలేదు.  అప్పుడు తన ప్లేస్ లో అయేషా కూర్చింది. తను కూడా బానే మాట్లాడింది. మౌనిక ఒక 4 ,5 రోజులు రాలేదు. అంతలోనే అయేషా బాగా క్లోజ్ అయ్యింది. అందులో తను స్కూల్ కి వచ్చేదారిలోనే మా ఇల్లు. మాములుగా అయితే ప్రతి రోజు నేను స్కూల్ కి వసంత్ తో కలిసి వెళ్ళేవాణ్ణి. ఇలా గ్రూప్స్ గా చేసాక సాయంత్రం 6 వరకు క్లాస్ ఉంటుంది. అందుకని అయేషా నేను మీతో పాటు వస్తాను అనింది. అప్పటినుంచి తను మా ఇంటికి వచ్చి అక్కడనుండి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. మాతో పాటు వసంత్ వచ్చేవాడు. 

           కొన్ని రోజులకు మళ్లి ఎగ్జామ్స్ పెట్టి గ్రూప్స్ మార్చారు. అప్పుడు వసంత్ C గ్రూప్ కి వెళ్ళాడు. అప్పటినుంచి తనకి ఎక్ట్రా క్లాస్ ఉండేది. ఇక నేను, అయేషా  ఇద్దరమే వెళ్ళేవాళ్ళం. అలానే ఉదయం కూడా త్వరగా స్కూల్ కి వెళ్లి అక్కడే హోమ్ వర్క్స్ చేసుకునేవాళ్లం.  అప్పుడప్పుడు అయేషా టిఫిన్ కూడా స్కూల్ కెళ్ళాక చేసేది. 

             ఒక రోజు ఉదయం స్కూల్ కి వెళ్ళాక అయేషా ఎదో రాసుకుంటూ ఉండగా పెన్ కింద పడుతుంది. ఒకేసారి ఇద్దరు పెన్ తీయబోతారు, అప్పుడు అనుకోకుండా నా పెదాలు తన చెంప కి తగులుతాయి. దాంతో ఇద్దరం  బయపడ్డాం. అంతలోనే క్లాస్ లో కి ఎవరో వచ్చారు. ఇక నేను ఆరోజంతా తనతో ఏం మాట్లాడలేదు. సాయంత్రం కూడా నేను ముందే ఇంటికొచ్చాను. ఏం జరుగుతుందో, తాను ఏం అంటుందో అని తెగ భయమేస్తుంది. వాళ్ళ ఇంట్లో చెప్తే ఏదయినా గొడవ అవుతుందో అని భయం. మరుసటి రోజు తాను స్కూల్ కి రాలేదు. నాలో ఇంకా భయం ఎక్కువయ్యింది. కొంపతీసి ఇంట్లో చెప్పాకా స్కూల్ మాన్పించారా ఏంటి అని. నేను ఒకరోజు స్కూల్ కి వెళ్ళలేదు.

             రెండు రోజుల తరువాత తను ఉదయం స్కూల్ కి వెళ్దామా అని ఇంటి  దగ్గరకొచ్చింది. నేను కొంచెం సేపు ఆలోచించి బయల్దేరాను. కొంచెం దూరం వెళ్ళాక  చిన్నగా సారీ అది ఎదో అనుకోకుండా జరిగింది, కావాలని మాత్రం చేయలేదు, అని చేప్పాను. అప్పుడు తను చిన్నగా నవ్వి దేనికి సారీ. అది నువ్వు కావాలని చేయలేదని నాకు తెలుసులే అంది. అవునా మరేందుకు ఇన్ని రోజులు స్కూల్ కి రాలేదు అన్నాను. అప్పుడు తను నాకు జ్వరం వచ్చింది, అందుకనే రాలేదు అంది. హమ్మయ్య అయితే నీకేం కోపం లేదుకదా, నువ్వేమంటావో అని చాల భయపడ్డాను, పైగా నువ్వు స్కూల్ కి రాకపోయేసరికి ఇంట్లో కూడా చెప్పవేమో వాళ్ళేమన్నారో అని భయపడి నేనే స్కూల్ మానేద్దామని అనుకున్న తెలుసా అన్నాను. తను నవ్వుతూనే అంత భయం దేనికి నువ్వేమి కావాలని చేయలేదుగా, ఒకవేళ కావాలని చేసిన నేను ఏమి అనను అంది. అంటే నాకు ఏం అర్థం కాక ఏమన్నావు అని అడిగా, తను సిగ్గు పడుతూ అవును నువ్వంటే నాకు ఇష్టం అంది. నాకు లోలోపల సంతోషంగానే ఉన్న, మీరు, మేము వేరు కదా, ఇవన్నీ మనకు సెట్ అవుతాయా అని అడిగితే, ఏం కాదులే మనం బాగా చదువుకొని,  మంచి జాబ్ చేస్తే  అన్ని అవే సర్దుకుంటాయి అంది. 

             ఇక నాకు చెప్పలేనంత ఆనందం.మా విషయం ఎవరికి తెలియకూడదు అనుకున్నాం. ఇక ఇద్దరమే రోజు స్కూల్ కి ముందే వెళ్లి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వసంత్ ని వదిలేసి మేమ్ వెళ్లడం తనకు నచ్చేది కాదు. నా మీద కోపం తో సరిగ్గా మాట్లాడటం కూడా మానేసాడు. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది, సురేష్ స్నేహితుడు శేఖర్ నా ప్రక్కనే కూర్చునే మౌనిక ని లవ్ చేస్తున్నాడని, కానీ సురేష్ నేను మౌనిక ని చేస్తున్నాననుకొని వాణ్ణి వదిలేయమన్నదంతా. సురేష్ కూడా వచ్చి నన్ను అడిగాడు అలాంటిదేమి లేదు, తను నాకు మంచి ఫ్రెండ్ అని చేప్పాను. అయితే శేఖర్ లవ్ కి సహాయం హెల్ప్ చెయ్యమంటాడు. నేను చెయ్యను, వాణ్ణి కూడా వదిలేయమని చెప్పా, తను నాకు చెల్లి లాంటిది, వీడేమో మంచోడు కాదు అని చెప్తే సురేష్ కి నచ్చలేదు. నువ్వు చేయనప్పుడు నీకెందుకు వదిలేయ్ అంటున్నాడు. ఇక ఇద్దరికీ గొడవ అయి వాడు మాట్లాడట్లేదు. 

             ఇంతలో స్కూల్ లో ఎగ్జామ్స్ జరిగాయి. అయేషా కి, నాకు ఇద్దరికీ మార్కులు తక్కువ వచ్చాయి. అప్పుడే ఇద్దరం ఇలా ఉండకూడదు, కలిసి ఉంటె సరిగ్గా చదవలేము, పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు మనం దూరంగా ఉండాలి అనుకొన్నాం. ఇక ఉదయం వసంత్ తో కలిసి ముగ్గురం వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఎక్కువ ఏం మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఎగ్జామ్స్ దగ్గరయ్యేకొద్దీ ఎప్పుడు చదువుకునే వాళ్ళం. మౌనిక నా ప్రక్కనే కాబట్టి తను బానే మాట్లాడేది. ఏదయినా డౌట్స్ ఉంటె ఒకరికి ఒకరం చెప్పుకునేవాళ్ళం. ఇలా ఉండగా నేను,అయేషా లవ్ చేసుకుంటున్నట్టు వసంత్ కి తెలిసింది. ఎగ్జామ్స్ కోసమే దూరంగా ఉన్నామని కూడా తెలుసుకొన్నాడు. అప్పుడు వాడు ఏమి తెలియనట్టుగా అయేషా తో నేను,మౌనిక లవ్ చేసుంటున్నారని అందుకే మనల్ని దూరం పెట్టాడని చెప్తూ ఉండేవాడు. కొన్ని రోజులకు అయేషా కూడా నమ్మడం మొదలు పెట్టింది. ఒకరోజు నాతో ఇదంతా చెప్పి నువ్వు నన్ను మోసం చేస్తున్నావని గొడవ పెట్టుకుంది. నేను ఎంత చెప్పిన తను వినలేదు. నాతో పూర్తిగా మాట్లాడటం మానేసింది.

              ఎగ్జామ్స్ కి చదువుకోవడానికి స్కూల్ లో సెలవులు ఇచ్చారు. ఇక నేను ఇంటి దగ్గరే ఉంది చదువుకునేవాడిని. అప్పుడప్పుడు తన కోసం వెతుకుతూ వాళ్ళ ఏరియా కి వెళ్ళేవాని, కానీ ఎప్పుడు కనిపించలేదు. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. నాకు తనకు సెంటర్ వేరే వేరే స్కూల్స్ పడ్డాయి. అందుకని నేను ఎగ్జామ్ త్వరగా రాసి తన సెంటర్ దగ్గరకి వెళ్ళాను, కానీ తను కనపల్లేదు. తర్వాత రోజు ఇంకా తొందరగా ఎక్సమ్ రాసి తనకోసం వెళ్ళాను, అయినా కనిపించలేదు. ఇలా రోజు ఎక్సమ్ రాసి వెళ్ళేవాణ్ణి, ఒకసారి కూడా తనని కలుసుకోలేదు. ఇక ఆఖరి ఎక్సమ్ త్వరగా రాసేసి వెళ్తే తను అక్కడలేదు. ఇక చేసేదేమి లేక బాధపడుతూనే ఇంటికి తిరిగి వస్తుంటే దారిలో తను కనిపించింది. నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తుంది. నేను తనని ఓదరొస్తు ఏమైంది, నేను ప్రతి రోజు నీకోసం వస్తున్నా నువ్వు కనపడక నేను బాధపడ్డాను ఆ ని చెప్పా. తను వెంటనే నేను నీకోసం రోజు వస్తున్నా నువ్వు ఉండట్లేదు. ఈరోజు నిన్ను కలుసుకోకపోతే ఇక ఎప్పటికి కలుసుకోలేనేమ్ అని నీకోసమే వెతుకుతున్న అంది. అప్పుడు ఇద్దరం ఒకరికొకరం సారీ చెప్పుకొని వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చింది. అప్పుడప్పుడు ఫోన్ చెయ్, నేను ఇంకా ఇంటినుంచి బయటికి రాకపోవచ్చు,  కాలేజీ కూడా చదువుతానో లేదో అని బాధపడింది. ఏం కాదులే మనం మళ్ళీ మళ్లీ కలుస్తుంటాము. కాలేజీ కి తప్పని సరిగా వస్తవులే అని ధైర్యం చెప్పి ఇద్దరం ఇళ్లకు వచ్చేసాము. 

             ఇప్పడు ఇక అంత హ్యాపీనే. తను మాట్లాడుతుంది. ఎగ్జామ్స్ కూడా బాగా రాసాము. ఒక పది రోజులయ్యాక తనకి ఫోన్ చేశా, అప్పుడే తను సంతోషంతో మనం మళ్ళీ కలవొచ్చు అంది. ఎలా అని అడిగితె తను వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్తున్నాను, అక్కడ మా పిన్ని కూతురు మాత్రమే ఉంటుంది, పిన్ని బాబాయి ని కలవటానికి సౌదీ వెళ్తుంది అంది. కానీ మీ చెల్లి ఉంటుంది కూడా ఏం కదా అని అడిగాను. తనకి మన లవ్ గురించి చేప్పాను, తను కూడా ఒప్పుకుందిలే. ఏం ఇబ్బంది ఉండదు. ఇక నుంచి మనం రోజు కలవొచ్చు అని సంతోషంతో మాట్లాడింది. నేను కూడా తనని కలవొచ్చని హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇక వాళ్ళ పిన్ని ఇంట్లో మేమ్ రోజు కలుసుకునేవాళ్ళం. అలానే వాళ్ళ పిన్ని కూతురు కూడా చాలా బాగా మాట్లాడేది. ముగ్గురం కలిసి ఏదోకటి ఆడుకుంటూ, తినుకుంటు హ్యాపీ గా ఉండేవాళ్ళం.

             అప్పుడే అయేషా కి ఇంట్లో పెళ్లి చేయాలనీ చూస్తున్నారు అంది. తన ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రోజు వాళ్ళ చెల్లి కలిసి అయేషా కి పెళ్లి కుదిరింది, నీతో ఒకసారి మాట్లాడాలంట ఫోన్ చేయమని చెప్పింది. ఎలా ఉందొ అని ఫోన్ చేశా తను ఏడూస్తూ నేను ఈ పెళ్లి చేసుకోను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అంటుంది. నేనేమో మన వయసెంత, అయినా నీకు అప్పుడే ఎందుకు పెళ్లి చేస్తున్నారు, ఈ వయసులో పెళ్లి చేయకూడదు కదా, ఎవరు ఏం చెప్పారా మీ వాళ్లకు అని అన్నాను. మా ఇంట్లో చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు.మా ఇళ్లలో ఇది మామూలే కానీ నన్ను ఎక్కడికైనా తీసికెళ్ళు, లేదంటే నేను ఏదయినా తాగి చచ్చిపోతాను అని ఏడుస్తుంది.ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎక్కడికైనా తీసుకెళదామంటే ఇంత చిన్న వయసులో ఎక్కడికెళ్తాము, ఏం చేస్తాము. ఏదయినా చేసి పెళ్లి ఆప్ ధైర్యం లేదు. తనకేం చెప్పలేక పోతున్న. తనేమో చచ్చిపోతాను అంటుంది. అది తలుచుకుంటే ఇంకా భయమేస్తుంది. అందుకే తనకి పెళ్లి రోజు అర్థరాత్రి మీ ఇంటికొస్తాను, ఇద్దరం కలిసి రాత్రి హైదరాబాద్ రైలు ఎక్కి వెళ్లిపోదాము అని చేప్పాను. తను నువ్వు కానీ రాకపోతే నేను చచ్చిపోతాను అంటూఫోన్ పెట్టేసింది.

            ఇప్పుడిక ఏం చేయాలి, ఎలా చేయాలో అని భయంగా ఉంది. తన పెళ్లి రోజు వచ్చింది, ఈరోజు రాత్రి తనకోసం వెళ్ళాలి, కానీ ధైర్యం సరిపోక నేను ఒక్కడైనా హైదరాబాద్ కి వెళ్ళాను. ఒక నెల అక్కడే ఉంది కాలేజీ టైం కి ఇంటికొచ్చాను. ఇక తనెలా ఉందొ  ఏమో అని ఒకసారి వాళ్ళ చెల్లి కలిసాను. తనకు పెళ్లి జరిగిందని, కానీ ఆరోజు రాత్రి చేయి కోసుకోబోయిందని, అందరు తనని తిట్టి పెళ్లి చేసారని, ఇప్పుడు పర్లేదు బానే ఉందిలే అని చెప్పింది. తను అలా చేసిందంటే నాకే సిగ్గేస్తుంది. ఒకవేళ తనని తీసికెళ్ళుంటే బాగుండేదేమో అనిపించింది.తనకు ఉన్న ధైర్యం నాకు లేదని నా మీద నాకే అసహ్యం వేసింది.  ఏమోలే ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకు తను అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటుందిలే అనుకొన్నాను. 

             ఇప్పుడు ఇదంతా తలుచుకుంటే ఒకరకంగా నేను తప్పు చేయలేదనే అనిపిస్తుంది. తొందరపడి తనని తీసికెళ్ళుంటే ఇప్పుడు ఎలా ఉండేదో ఏమో. ఆ వయసులో ఎన్ని కష్టాలు పడేవాళ్ళమో కదా అని నా మనసుకి నేనే సర్దిచెప్పుకున్నాను. నేను అప్పుడు తనకి అలా మాట ఇచ్చి మోసాను చేశాననే ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటుంది. అయినా తనది ఏం తప్పులేదు. నన్ను ప్రేమించిన మొదటి అమ్మాయి తనే. నా జీవితం లో తను లేకపోవచ్చు కానీ జీవితాంతం నా ఆలోచనలో ఉంటుంది.

Comments

Popular posts from this blog

ప్రేమ పెళ్లి

            హాయ్ నా పేరు ఆకాష్. ఇన్నాళ్ల  నా కల ఈరోజు నిజమవుతుంది. హ అవును నా పెళ్లి .  5యేళ్ల నా ప్రేమ ఈరోజు పెళ్లిగా మారుతుంది. తన పేరు భూమి. నా మరదలు. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. ఒకరంటే ఒకరికి ప్రాణం. నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి తనుఒక్కటే. ఇద్దరి ప్రవర్తనలు వేరు వేరు. కానీ ఇద్దరి ఆలోచనలు ఒకటే. నేను ఈరోజు హ్యాపీ ఉంటె చాలు అనుకునే వాణ్ణి. తనేమో రేపటి గురించి ఆలోచన ఉండాలి అంటుంది.                అయినా మా ప్రేమ చాల విచిత్రంగా, నిజంగా సినిమా లో చూపించినట్టే కలిగింది. చిన్నప్పుడు గొడవలు, పెద్దయ్యాక ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ పుట్టాయి. మొదట్లో తనకు మా పెళ్లి జరగదేమో అనేది. ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి వద్దు అనేది. నేను కూడా అంతే కదా అనుకునేవాణ్ణి. కానీ కొన్నాళ్ళకు మా ప్రేమ మీద మాకు నమ్మకం పెరిగింది. ఇంట్లో తెలిసాక అందరు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు మా పెళ్లి ఇంత సంతోషంగా జరుగుతుంది. ఇక ఒక గంటలో తనని పెళ్ళికూతురిలా చూడబోతున్న. నేను ఫుల్ గ రెడీ అయ్యి కళ్యాణమండపానికి బయల్దేరుతున్నాను .   ...