- Get link
- X
- Other Apps
హాయ్ నా పేరు ఆకాష్. ఇన్నాళ్ల నా కల ఈరోజు నిజమవుతుంది. హ అవును నా పెళ్లి . 5యేళ్ల నా ప్రేమ ఈరోజు పెళ్లిగా మారుతుంది. తన పేరు భూమి. నా మరదలు. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. ఒకరంటే ఒకరికి ప్రాణం. నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి తనుఒక్కటే. ఇద్దరి ప్రవర్తనలు వేరు వేరు. కానీ ఇద్దరి ఆలోచనలు ఒకటే. నేను ఈరోజు హ్యాపీ ఉంటె చాలు అనుకునే వాణ్ణి. తనేమో రేపటి గురించి ఆలోచన ఉండాలి అంటుంది. అయినా మా ప్రేమ చాల విచిత్రంగా, నిజంగా సినిమా లో చూపించినట్టే కలిగింది. చిన్నప్పుడు గొడవలు, పెద్దయ్యాక ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ పుట్టాయి. మొదట్లో తనకు మా పెళ్లి జరగదేమో అనేది. ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి వద్దు అనేది. నేను కూడా అంతే కదా అనుకునేవాణ్ణి. కానీ కొన్నాళ్ళకు మా ప్రేమ మీద మాకు నమ్మకం పెరిగింది. ఇంట్లో తెలిసాక అందరు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు మా పెళ్లి ఇంత సంతోషంగా జరుగుతుంది. ఇక ఒక గంటలో తనని పెళ్ళికూతురిలా చూడబోతున్న. నేను ఫుల్ గ రెడీ అయ్యి కళ్యాణమండపానికి బయల్దేరుతున్నాను . ...